156 total views, 1 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి ఏ చిత్రం చేస్తున్నారు అనే ఆతృత అటు అభిమానుల్లోనూ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరుతో మంచి సక్సెస్ కొట్టిన మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తదుపరి సినిమా చేస్తారని, ఆయన చెప్పిన కధ కూడా మహేష్ బాబుకి నచ్చిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే వంశీ పూర్తి స్థాయి కథను సిద్ధం చేయకపోవడంతో, లేటెస్ట్ న్యూస్ ప్రకారం పరుశురాం తో ఆయన తదుపరి సినిమా ఓకే అయిందని తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ గా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ నటిస్తోందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే మహేష్ బాబు కూడా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇంట్లో నే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయినట్లయితే, మహేష్ తో నటించే ఛాన్స్ ని మహానటి కొట్టేసినట్లే…..!!