కార్తీ ‘ఖైదీ’ హిందీ వెర్షన్ లో హీరోగా చేస్తోంది ఎవరంటే….??

 134 total views,  1 views today

తమిళ నటుడు కార్తీ ఇటీవల నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీ. కొద్దివరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో పాటలు, ఎంటర్టైన్మెంట్ లేనప్పటికీ, ఆకట్టుకునే కథ, కథనాలే బలంగా సినిమా ముందుకు నడుస్తుంది. 

తన కూతురిని వెతుక్కుంటూ బయలుదేరిన ఒక తండ్రి, మధ్యలో ఎదురైన కొన్ని సంఘటనలు, పరిస్థితులను ఎదుర్కొని ఏ విధంగా చివరికి తన కూతురిని కలుసుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమాని దర్శకుడు లోకేష్ ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా హిందీ వర్షన్ లో హీరోగా అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన రావడం జరిగింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీం వారియర్ పిక్చర్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 21, 2021 నాడు రిలీజ్ చేయనున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *