140 total views, 1 views today
మాజీ తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత గురించి మన తెలుగు వారికీ కూడా ప్రత్యేకంగా పరిచయం లేదనే చెప్పాలి. తమిళం తో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించిన జయలలితకు ఇక్కడ కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన తమిళ ప్రజలు ఇప్పటికీ కూడా ఆమెను తమ మనస్సులో ఆరాధిస్తూనే ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం జయలలిత బయోపిక్ లు గా మొత్తం మూడు సినిమాలు రెడీ అవుతుండగా, వాటిలో రమ్యకృష్ణ ఒక వెబ్ సిరీస్ ఇప్పటికే బయటకు వచ్చి మంచి స్పందన రాబట్టగా,
ప్రస్తుతం కంగనా రనావత్ తో పాటు నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో మరొక సినిమా తెరకెక్కుతోంది. ఇక ప్రస్తుతము కంగనా నటిస్తున్న తలైవి సినిమా నుండి జయలలిత అఫీషియల్ లుక్ ని నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నేడు జయలలిత జయంతి కావడంత ఆమె లుక్ లో ఉన్న కంగనా పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే అచ్చం ఆమె మాదిరిగానే కంగనా ఆ పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటిస్తున్నట్లు ఆ పోస్టర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది….!!
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]