మరో సారి పవన్ ప్రక్కన ఛాన్స్ పట్టేసిన ఆ స్టార్ హీరోయిన్…. !!

 139 total views,  2 views today

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో వర్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్, దాని అనంతరం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పీరియాడికల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. వాస్తవానికి ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా నిలుపుదల చేసారు. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

Kajal Agarwal and Pawan Kalyan in PSPK28 | OK Telugu

మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే పవన్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో జతకట్టిన కాజల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, కాజల్ రొట్టె విరిగి నేతలో పడ్డట్లే…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *