ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ అదేనా…. ??

 539 total views,  1 views today

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అరవిందసమేత సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. శత్రువును చంపడం కాదు, అతడిని మంచివాడిగా మార్చి తనవైపుకు తిప్పుకున్న వాడే నిజమైన మగాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ వీర రాఘవ అనే పవర్ఫుల్ రోల్ లో నటించారు. ఇకపోతే అతి త్వరలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతున్న సెకండ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 

ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఎనర్జిటిక్ రోల్ లో నటిస్తున్నారని, ఇక సినిమా కొంత వరకు రాజకీయాలు, మరికొంత ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుందని, ఇక ఇటీవల త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్స్ పుష్కలంగా ఉండనుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *