ఆ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ షాక్ తప్పదా….??

 206 total views,  1 views today

ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమాలో నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోస్తిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ తాలూకు ఫస్ట్ లుక్ ని ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా వాటికి ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇకపోతే రాబోయే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆరోజున కొమరం భీం లుక్ రిలీజ్ చేస్తారని మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

What SS Rajamouli felt when he choose Junior NTR as his first movie Hero, నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇక నేడు కాసేపటి కృత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ లో రాజమౌళి ఈ విషయమై మాట్లాడుతూ, వాస్తవానికి రామ్ చరణ్ టీజర్ తాలూకు చాలావరకు ఫుటేజ్ సిద్ధంగానే ఉందని, కొంత మాత్రమే వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో దానిని తన యూనిట్ సహకారంతో పూర్తి చేసి తన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగలిగాము అని, అయితే ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ వలన దేశాన్ని లాక్ డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమలో షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి కూడా చెప్పలేని పరిస్థితని, అదీకాక ఎన్టీఆర్ సీన్స్ తాలూకు ఫుటేజ్ అంతా కూడా ఆఫీస్ లో ఉండిపోవడంతో ఇప్పటి పరిస్థితుల్లో అది తీసుకురావడం కుదరని పని అని, అందువలన తన బర్త్ డే సమయానికి ఫ్యాన్స్ కి ఏ విధంగా గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నట్లు తెలిపారు రాజమౌళి. అయితే దేనిని బట్టి ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశం చాలావరకు లేనట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *