‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్…..!!

 140 total views,  1 views today

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా పూర్తి గా నిలుపుదల చేయబడడంతో నటీనటులు కూడా పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో మన ఇంట్లోని వారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ని, ఆయన ఇటీవల దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కి విసరగా, దానిని స్వీకరించి పూర్తి చేసిన రాజమౌళి,

 


ఆపై రామ్ చరణ్, ఎన్టీఆర్, శోభు యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లకు ఆ ఛాలెంజ్ ని విసిరారు. కాగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ తన ఛాలెంజ్ ని పూర్తి చేయడం జరిగింది. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు కాదు పంచుకుందాం అంటూ ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ట్వీట్ చేయడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *