211 total views, 1 views today
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, దాని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి స్క్రిప్ట్ ఆల్మోస్ట్ సిద్ధం అయిందని,
అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యువ సంగీత తరంగం థమన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేతకు వర్క్ చేసిన థమన్, ఇటీవల బన్నీతో త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది…..!!