మరొక పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘జూనియర్ ఎన్టీఆర్’….!!

 250 total views,  1 views today

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట.

Not Prashanth Neel, Atlee to direct Jr NTR next?

ఇకపోతే ఈ సినిమా తరువాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారని ఇప్పటికే పలు టాలీవుడ్ వర్గాల్లో కొద్దిరోజుల నుండి ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఆప్ డేట్ ప్రకారం, త్రివిక్రమ్ సినిమా అనంతరం అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అయిందని, తెలుగు, తమిళ్ తో పటు పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా ఫీల్ తో ఎంతో భారీ రేంజ్ లో ఆ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. మరికొద్దిరోజుల్లో ఆ సినిమా తాలూకు అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *