140 total views, 1 views today
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ఇదే అంటూ నేడు ఉదయం నుండి ఒక పోస్టర్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. అయితే అది ఒరిజినల్ కాదని, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలిసింది.
అయితే ఆ పోస్టర్ ఎవరు డిజైన్ చేసారో తెలియదు కానీ, దానిపై సర్వత్రాల ప్రశంసలు కురుస్తున్నాయి. మరొక 37 రోజుల్లో యంగ్ టైగర్ బర్త్ డే ఉన్నందున, ఆయన అభిమాని ఒకరు దానిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని 2021, జనవరి 8 న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే….!!