ఎన్టీఆర్ ‘కొమరం భీం’ టీజర్ … మాటల్లేవ్ … మాట్లాడుకోవడాల్లేవ్ ….!!

 404 total views,  1 views today

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్ రెండు కూడా ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది.

Ram Charan introduces Jr NTR, Komaram Bheem in RRR new teaser. Trending video - Movies News

ఇకపోతే నేడు ఎన్టీఆర్ కోరమం భీం పాత్ర యొక్క ఇంట్రడక్షన్ వీడియో ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఆ టీజర్ లో అద్భుతమైన విజువల్స్, కీరవాణి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్బ్ వాయిస్ ఓవర్ వంటివి అదిరిపోయాయి అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్, లైక్స్ తో దూసుకెళుతోంది. మరి ఇంకెందులు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ పై ఒక లుక్ వేయండి ….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *