జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ సంబరాలు చూసారా….??

 174 total views,  2 views today

ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ లో నటిస్తున్న ఎన్టీఆర్, రెండేళ్ల క్రితం అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. తొలిసారిగా రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటివి ఆలస్యం కారణంగా దీనిని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేయడం జరిగింది. 

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కథను వి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ సినిమా సంగతులతో పాటు ఫ్యామిలీ విషయాలు కూడా ఫ్యాన్స్ తో పంచుకునే అలవాటున్న జూనియర్, నేడు తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంతో హ్యాపీ గా హోలీ జరుపుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. 

పెద్ద తనయుడు అభయ్ రామ్, చిన్న తనయుడు భార్గవ్ రామ్, భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హోలీ సందర్భంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన ఎన్టీఆర్, అభిమానులకు ప్రేక్షకులకు హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తదుపరి సినిమా చేయనున్న ఎన్టీఆర్, దానిని ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *