202 total views, 1 views today
రేపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన 34వ జన్మదినాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో మరొక స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చరణ్, ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొన్న ఉగాది నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయి పెద్ద సంచలనం సృష్టించింది.
ఇక రేపు చరణ్ బర్త్ డేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూట్యూబ్ వీడియో ద్వారా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది తప్పకుండా చరణ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి గిఫ్ట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు ఎన్టీఆర్. రేపు ఉదయం 10 గంటలకు అల్లూరి కి కొమరం భీం ఇవ్వనున్నది ఏమిటి అనేది తెలియాలంటే ఆ సమయానికి యూట్యూబ్ ఆన్ చేసి ఎదురు చూడాల్సిందే మరి…..!!