233 total views, 3 views today
ఇటేవల రెండేళ్ల క్రితం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ మంచి రేటింగ్స్ తో పాటు విపరీతమైన క్రేజ్, వీక్షకధారణతో ముందుకు సాగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోని మళ్ళి ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన దేశాన్ని కొన్నాళ్లపాటు లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండడంతో, మంచి రేటింగ్స్ వస్తాయని భావించి నేటి నుండి స్టార్ మా మ్యూజిక్ లో పునః ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా స్టార్ మా యాజమాన్యం నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
వాస్తవానికి ఇటీవల లాకౌట్ ప్రకటించిన సమయంలో ముందుగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 3 ని ప్రసారం చేయగా, దానికి కూడా మంచి రేటింగ్స్ రావడంతోనే నేటి నుండి మొదటి సీజన్ ని ప్రసారం చేయనున్నారట. మరి రెండేళ్ల తరువాత పునః ప్రసారం కాబోతున్న ఈ షో ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి….!!