114 total views, 1 views today
టాలీవుడ్ లో కొన్నేళ్ల నుండి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి పేరుతో ముందుకు సాగుతున్న నటుడు బ్రహ్మాజీ. మెగాస్టార్ చిరంజీవి నుండి దాదాపుగా సినిమా ఇండస్ట్రీ లోని అందరూ నటులతో మంచి పరిచయం గల బ్రహ్మాజీ, ప్రస్తుతం తన కొడుకు సంజయ్ నటిస్తున్న తొలి సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేయగా, థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు. ఆ తరువాత సినిమా టీమ్ కు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసి సందడి చేసారు. ఇకపోతే నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఓ పిట్ట కథ టీమ్ కు అలానే బ్రహ్మాజీకి ఆయన తనయుడికి సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఆ ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!
Best wishes to Sanjay, my friend @actorbrahmaji and the entire team of #OPittaKatha for the release tomorrow
— Jr NTR (@tarak9999) March 5, 2020