యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ సినిమాకు నేటితో 24 ఏళ్ళు….!!

 129 total views,  2 views today

టాలీవుడ్ యువ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరొక నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ తన చిన్నతనంలో మొదట గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బలరామాయణం సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు.

Image

1996లో శబ్దాలయ థియేటర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో జూనియర్ రాముడిగా నటించగా, బాలనటి స్మిత మాధవ్ సీతగా నటించింది. చిన్న వయసులోనే రాముడిగా తన అద్భుత నటనతో ఎన్టీఆర్ ప్రేక్షకుల మెప్పు పొందారు. కాగా ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంబరంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో సినిమా యూనిట్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *