182 total views, 1 views today
రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించగా, పూరి కనెక్ట్స్, పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది.
రామ్ అదిరిపోయే యాక్షన్ తో పాటు పూరి మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే స్క్రీన్ ప్లే, ఫైట్స్, వండర్ఫుల్ సాంగ్స్, యాక్షన్ సీన్స్ కలగలిపి ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి. ఇకపొతే ఇటీవల ఫిబ్రవరి నెలలో యూట్యూబ్ లో ఈ సినిమా హిందీ వర్షన్ ని అప్ లోడ్ చేయడం జరిగింది. కాగా నేటికీ ఈ సినిమా మొత్తం 100 మిలియన్ల వ్యూస్ అందుకుని, అతి తక్కువ కాలంలోనే ఇన్ని వ్యూస్ అందుకున్న సినిమాల జాబితాలో చేరింది. దీనితో రామ్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో ఖుషి అవుతున్నారు……!!