173 total views, 1 views today
ఎనర్జిటిక్ స్టార్ రామ్, గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా అదిరిపోయే హిట్ కొట్టిన విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా నటించిన ఆ సినిమాలో రామ్ ఊర మాస్ లుక్ లో కన్పించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.
The Sun don’t let you smile.. #summers ☄️ …k..imma head back inside now…🚶♂️
Happy weekend..
Love..#RAPO pic.twitter.com/Q3fqNGa3L3— RAm POthineni (@ramsayz) April 25, 2020
ఇక ప్రస్తుతం తమిళ మూవీ ‘తడం’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న రెడ్ లో నటిస్తున్నారు రామ్. ఆ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తున్న రామ్, సినిమా లుక్ కోసం ఇటీవల ఫుల్ గా గడ్డం పెంచారు. అయితే కొద్దిరోజులుగా కరోనా వలన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో నేడు క్లీన్ గా షేవ్ చేసుకుని రెడ్ కలర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చిన రామ్, ఆ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు….!!