170 total views, 1 views today
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఆ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కించనున్నాయి. కాగా ఆ సినిమా అనంతరం ఎన్టీఆర్, ఒక బడా బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోయే పీరియాడికల్ మూవీ లో నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల
టాక్. ఆయన మరెవరో కాదు, భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ.
అతి త్వరలో ఎన్టీఆర్ తో సంజయ్ ఒక భారీ మూవీ తీయనున్నారని, ఇటీవల లాక్ డౌన్ కు ముందు ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిసిన సంజయ్, ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని, అది విన్న ఎన్టీఆర్ చాలాబాగుంది, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి చెప్పండి సినిమా చేద్దాం అని అన్నారట. అటు బాలీవుడ్ లో కూడా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!!