‘పుష్ప’ తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అదేనా…..??

 117 total views,  1 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్, దాని అనంతరం నటించబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

Allu Arjun contributes Rs 1.25 crore for COVID-19 aid- The New ...

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య  సినిమా చేస్తున్న కొరటాల, అల్లు అర్జున్ కోసం ఒక మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేసారని, ఇటీవల అది అల్లు అర్జున్ ని వినిపించగా, అదిరిపోయింది, మరికొద్దిరోజుల్లో సినిమాని మొదలెడదాం అని చెప్పినట్లు టాక్. అయితే ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే పుష్ప అనంతరం కొరటాల శివ సినిమా ఉంటుందని, ఆ తరువాతనే ఐకాన్ సినిమా చేస్తారని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై పూర్తి వాస్తవాలు వెల్లడి కావలసి ఉంది….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *