147 total views, 1 views today
ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని ఎంతో భారీగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ఒక కీలక రోల్ ఉందని, దానికోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల కొరటాల చెప్పారు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో చరణ్ బిజీగా ఉన్నందువలన ఆయన ఎంతవర్కౌ ఈ పాత్రలో నటిస్తారు అనేది ఇంకొంత సమయం గడిస్తేనే కానీ చెప్పలేం అని అన్నారు.
అలానే ఒక సందర్భంలో మహేష్ బాబుకు కూడా ఈ పాత్ర గురించి చెపితే, మీకు ఎటువంటి సమస్య ఉన్న ఇబ్బందిపడకండి, ఎందుకంటే మీకు నేనున్నాను, మీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం అని అన్నారని, అందుకు మహేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు కొరటాల. అయితే ఆ క్యారెక్టర్ విషయమై లేటెస్ట్ గా అందుతున్న వార్తలను బట్టి చూస్తుంటే మహేష్ బాబు ఆ రోల్ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఎందువలన అంటే, ఈ లాక్ డౌన్ అనంతరం చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండడం వలన ఆయన కాల్షీట్స్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ ఉండబోదని, కాగా మహేష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాని ప్రకటించకపోవడంతో మెగాస్టార్, కొరటాల ఇద్దరి మీద ఉన్న అభిమానంతో మహేష్ ఆ రోల్ లో నటించే అవకాశం ఎక్కువని అంటున్నారు. అయితే ఏమి జరుగనుంది అనేది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఓపికపట్టాల్సిందే అంటున్నారు…. !!!