152 total views, 1 views today
టాలీవుడ్ కి ముందుగా కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అనుష్క శెట్టి, అక్కడి నుండి మెల్లగా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా అనుష్క పెళ్లిపై పలు పుకార్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉన్నారని, అతి త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా, అవేవి నిజం కాదని అనుష్క ఖండించారు.
ఇంకా కొద్దిరోజులుగా అనుష్క పెళ్లి గురించి మరొక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. మన దేశంలో లాక్ డౌన్ ప్రకటనకు కొద్దిరోజుల ముందు అనుష్క తల్లితండ్రియులు ఆమెకు బెంగళూరు కు చెందిన ఒక యువ వ్యాపారవేత్తతో పెళ్లి సంబంధం కుదిర్చారని, అయితే ఈ లాక్ డౌన్ పూర్తి అయిన తరువాత ఇరు కుటంబాల బంధువులు కలిసి అధికారికంగా ప్రకటన చేయాలనీ భావిస్తున్నట్లు టాక్. కాగా దీనిపై ఎక్కడగా కూడా అధికారిక సమాచారం లేదని, నేరుగా అనుష్క కానీ లేదా ఆమె తల్లితండ్రులు కానీ దీనిపై స్పందిస్తేనే గాని నమ్మలేం అని కొందరు అంటున్నారు….!!!