128 total views, 2 views today
టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తన తదుపరి జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల అల్లు అర్జున్ తో తీసిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్, ఈ సినిమాని కూడా మంచి సక్సెస్ చేసేలా పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారట. ఇకపోతే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ఎవరితో వర్క్ చేస్తారు అనే దానిపై కొన్నాళ్లుగా టాలీవుడ్ లో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
వాస్తవానికి ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్, మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతుండగా, లేదు లేదు ఇటీవల పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని, అది విన్న పవన్, అతి త్వరలోనే సినిమా చేద్దాం అని చెప్పారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ రెండు వార్తల్లో అసలు ఏది నిజమే ఏది అబద్దమో తెలియక ఆయా హీరోల ఫ్యాన్స్ సతమతం అవుతున్నారు. మరి ఈ విషయమై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరికొద్దికాలం వెయిట్ చేయక తప్పేలా లేదు…….!!!