160 total views, 1 views today
యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇపపటివరకు తన కెరీర్ లో తీసిన అన్ని సినిమాలతో కూడా మంచి విజయాలు అందుకుని దూసుకెళ్తున్న అనిల్, ప్రస్తుతం ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఎఫ్ 3 కథను పూర్తి చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.
ఇక మొన్న ఒక తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఎఫ్ 3 కథ దాదాపుగా పూర్తి అయిందని చెప్పిన అనిల్, ఆ సినిమాలో మూడవ హీరోగా నటిస్తోంది ఎవరు, ఆయన యొక్క సర్ప్రైజ్ సినిమాలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడే చెప్పనని అన్నారు. అయితే అనిల్ ఆ మాట చెప్పిన దగ్గరి నుండి ఆ మూడవ హీరో ఎవరా అని టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతంగా చర్చలు మొదలయ్యాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఎఫ్ 3 లో నటించే మూడవ హీరో మహేష్ బాబు అని అంటున్నారు. కాగా దీనిపై ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదని, కాబట్టి కొద్దిరోజలు వెయిట్ చేస్తేనే గాని అన్ని విషయాలు బయటకు రావని అంటున్నారు విశ్లేషకులు….!!!