ఏంటి ‘ఆర్ఆర్ఆర్’ అప్పటికి వాయిదా పడిందా….??

 125 total views,  1 views today

టాలీవుడ్ యువ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని తొలుత ఈ ఏడాది జులై 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అని అనుకున్నప్పటికీ, షూటింగ్ లో కొంత జాప్యం కారణంగా వచ్చే ఏడాది జనవరి 8 కి పోస్ట్ పోన్ చేసారు. కాగా గత కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ తో మన దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా బంద్ అయి షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేయబడడంతో ఆర్ఆర్ఆర్ షూట్ కూడా ఆగిపోయింది.

rrr movie

ఇక ఇప్పటికే చాలా రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఈ సినిమా షూటింగ్ తో పాటు సిజి, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పూర్తి ఆగిపోయిందని, ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా ని మరొక నాలుగు నెలలు, అంటే రాబోయే సమ్మర్ కి వాయిదా వేసే అవకాశం గట్టిగా కనపడుతుందని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారికంగా సమాచారం లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ఇది నిజంగా ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కి పెద్ద నిరాశ కలిగించే వార్తే అని చెప్పాలి……!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *