అబ్బో ప్రభాస్ సినిమా చందమామ కథా….??

 127 total views,  1 views today

గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం పూజ హెగ్డే తో కలిసి జాన్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వలో యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రిట్రో ప్రేమకథగా తెరకెక్కుతుననట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి మొన్న ప్రకటన వచ్చింది. 

మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, ఒక చందమామ కథ వాలే ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అశ్విన్ ఈ సినిమా కథను రాసుకున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. అంతేకాక ఈ సినిమా కోసం దాదాపుగా రూ.250 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు పూర్తి వాస్తవాలు మాత్రం వెల్లడికావలసి ఉంది….!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *