మెగాస్టార్ – సూపర్ స్టార్ కాంబో ఇక లాంఛనమేనా…??

 157 total views,  1 views today

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంల్ తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపె బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు టాక్. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఇటీవల రామ్ చరణ్ ని తీసుకోవాలని భావించారట దర్శకుడు శివ, అయితే ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యేవరకు చరణ్ కు మరొక సినిమా చేసే ఉద్దేశ్యం లేకపోవడంతో, 

ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలని చూస్తుండగా మెగాస్టార్ సూచన మేరకు ఆ పాత్రకు మహేష్ బాబు అయితే బెటర్ అని భావించి ఆయనను సంప్రదించారని, అలానే ఆ స్టోరీ విన్న మహేష్, తన పాత్ర ఎంతో నచ్చడంతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గతంలో కొరటాలతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టారు మహేష్. అలానే చిరు ఫ్యామిలీతో కూడా మహేష్ కు మంచి అనుబంధం ఉండడంతో వెంటనే చేయడనికి ఒప్పుకున్నారని అంటున్నారు. సినిమాలో మహేష్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని, దాదాపుగా 30 నిమిషాల నిడివి ఉండే ఈ పాత్ర ద్వారా మహేష్ మరింత గొప్ప పేరు అందుకుంటారని అంటున్నారు. అయితే దీని పై మరికొద్దిరోజుల్లోనే సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *