అవకాశం వస్తే మహేష్ బాబు కు తల్లిగా నటిస్తా : రేణు దేశాయ్….!!

 165 total views,  1 views today

టాలీవుడ్ నటి, రచయిత, నిర్మాతైన రేణు దేశాయ్ ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా రూపకల్పన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తరువాత ప్రస్తుతం కుమారుడు అకీరా, కుమార్తె ఆద్యల తో కలిసి జీవనం సాగిస్తున్న రేణు దేశాయ్, తనకు తెలుగులో నటించాలని ఎప్పటినుండో ఉందని, అయితే ఇప్పటివరకు సరైన పాత్ర ఏది తనవద్దకు రాలేదని ఇటీవల పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.

Renu Desai Surprise About Tollywood Stars

ఇకపోతే నేడు కాసేపటి క్రితం ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ, తెలుగు సినిమాల్లో తనకు తల్లి పాత్రలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారికి చిన్నప్పటి క్యారెక్టర్లలో తల్లి పాత్ర చేయడానికి తాను సిద్ధం అని చెప్పడం జరిగింది. వాస్తవానికి మహేష్ బాబు కంటే రేణు వయసులో ఎనిమిదేళ్ల చిన్నది. కాగా రేణు దేశాయ్ చేసిన ఆ వ్యాఖలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *