140 total views, 1 views today
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న వరుణ్, నిన్న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో కాసేపు చాటింగ్ చేసి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
తనకు తన ఫ్యామిలీ నే పెద్ద బలం అని చెప్పిన వరుణ్, బాబాయి పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే నిజంగా అది పండగే అని అన్నారు. ఇక తన కెరీర్ లో వచ్చిన కంచె మాదిరి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించాలని ఉందని, తన చూపు కూడా అటువంటి స్క్రిప్ట్స్ పైనే ఉందని తెలిపారు వరుణ్…..!!