136 total views, 1 views today
యువ సంచలన నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా వరుసగా ఆయన నుండి వస్తున్న సినిమాలు అన్ని కూడా పరాజయం పాలవడంతో ఆయన ఫ్యాన్స్ తమ హీరోకు మంచి హిట్ పడితే చూడాలని ఎప్పటినుండో ఆశపడుతున్నారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్సకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్, ఎలాగైనా ఆ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నాడు.
కాగా ఇటీవల ఒక జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ మాట్లాడుతూ, తనతో కలిసి జీవితంలో ప్రయాణించే తన భార్యకు మంచి హ్యూమర్ తో పాటు దయాగుణం కూడా ఉండాలని, అలానే తనకు ఫ్యామిలీ లైఫ్ అంటే ఎంతో ఇష్టం అని, తనను బాగా అర్ధం చేసుకునే అమ్మాయి దొరికితే ఏ అబ్బాయికైనా అంతకన్నా కావలసింది ఏముంటుంది చెప్పండి అని అనడం జరిగింది. అయితే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ మీదనే ఉందని, సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని విజయ్ అన్నారు……!!