కరోనా పై హైపర్ ఆది ఇచ్చిన అదిరిపోయే స్పీచ్ విన్నారా….??

 149 total views,  2 views today

ప్రస్తుతం పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా మహమ్మారి కరోనా దెబ్బకు వీళ్ళవిలలాడుతున్నాయి. అయితే ఈ వ్యాధిని మరింతగా ప్రబలకుండా చేయడానికి ఇప్పటికే పలు దేశాలు కొన్ని వరాల పాటు లాకౌట్ ప్రకటించి ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేయడం జరిగింది. అయితే సోషల్ డిస్టెన్స్ ద్వారానే కరోనాని త్వరితగతిన తరిమికొట్టవచ్చని, అందుకనే మొత్తంగా 21 రోజుల పాటు మన దేశాన్ని లాకౌట్ చేస్తున్నట్లు మన ప్రధానమంత్రి మోడీ ఇటీవల తెలిపారు. అయితే ఈ కరొనపై ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వీడియో పోస్ట్ చేసాడు.

ఇన్నాళ్లు మనం బయట తిరిగి ఎంతో సంపాదించాము, అయితే ఈ కొద్దిరోజలు మాత్రం మన ప్రధానిగారు చెప్పినట్లుగా మనం అందరం కూడా పూర్తిగా ఇళ్లకు పరిమితం అయి ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ఆది అన్నారు. వాస్తవానికి మనం ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చినపుడు కనీసం కాలు కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్క బాల్ ని మిస్ కాకుండా ఆ మ్యాచ్ చూస్తాం. మరి ప్రస్తుతం అదేవిధంగా మనుషులకు కరోనాకు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ని కూడా అదేవిధంగా పూర్తిగా మన ఇళ్లకు పరిమితం అయి చూద్దాం అని, ఆ తరువాత తప్పకుండా మనదే విజయం అవుతుందని ఆది అన్నారు. ప్రస్తుతం ఆది పోస్ట్ చేసిన ఆ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *