206 total views, 1 views today
ముందుగా ఈటీవి లో వచ్చిన ఢీ అనే డాన్సింగ్ షోలో పార్టిసిపేట్ చేసి ఆపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి. అయితే హీరోయిన్ గా నటించిన ఫస్ట్ తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు తన అందం,
నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య తో కలిసి లవ్ స్టోరీ, అలానే రానాతో ఖైల్సి విరాట పర్వం సినిమాలు చేస్తోంది. కాగా నేడు ఆమె తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా పలువురు నటులు, అభిమానాలు ఆమెకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు……!!!