218 total views, 1 views today
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతో మంచి సక్సెస్ కొట్టి, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దలను చేసిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్, ఆ తరువాత పవర్ స్టార్ తో అజ్ఞాతవాసి, నానితో నేను లోకల్ సినిమాల్లో నటించి మరింత మంచి పేరు గడించింది. ఇక ఆ తరువాత నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితం గాథగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది.
అయితే గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లిపై పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. ముందుగా ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో, అలానే మరొక యువ పారిశ్రామికవేత్తతో, ఇకపోతే మొన్న ఏకంగా కోలీవుడ్ యువ కమెడియన్ సతీష్ తో కీర్తి కి వివాహమైనట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. అయితే అవన్నీ కూడా ఒట్టి పుకార్లు మాత్రమే అని, నిజంగా తనకు పెళ్లి నిశ్చయం అయితే తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటాను అని కీర్తి అన్నట్లు తెలుస్తోంది……!!