169 total views, 1 views today
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల కొంత షూటింగ్ ని జరుపుకుంది. అయితే ఇటీవల కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో దీనిని కూడా పూర్తిగా నిలుపుదల చేసారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉందనుదని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి నటిస్తోంది అంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో బోయపాటి మాట్లాడుతూ, తమ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నాం అని, అతి త్వరలో ఆమె ఎవరు అనేది ప్రకటిస్తామని, అలానే సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు బోయపాటి….!!