466 total views, 1 views today
దగ్గుబాటి రానా మొత్తానికి తన లవర్ ని మొన్న తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘డ్యూ డ్రాప్ స్టూడియో’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్న మిహిక బజాజ్ తన ప్రేమను ఒప్పుకుందని రానా తెల్పడం జరిగింది. భారతీయ వాస్తుశిల్ప కళంటే ఎంతో ఇష్టమున్న మిహిక డ్యూ డ్రాప్ స్టూడియో ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా రానాతో ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
కాగా రానా లవ్ సక్సెస్ కావడంతో పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు శుభాభినందనాలు తెల్పుతూ ట్వీట్స్ చేయడం జరిగింది. కాగా వారిద్దరికీ ఎంతో కాలం నుండి పరిచయం ఉందని, అలానే తమ రెండు కుటుంబాల మధ్య మంచి సయోధ్య ఉందని, వీలైనంతవరకు డిసెంబర్ లో వారి వివాహం జరిగే అవకాశం ఉందని నిర్మాత సురేష్ బాబు నేడు మీడియాకు వెల్లడించారు…….!!