253 total views, 1 views today
యంగ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్సకత్వంలో రెడ్ అనే మూవీలో హీరోగా ఆయన నటిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకముగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
తమిళ్ లో ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన తడం సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబడుతోంది. రామ్ రెండు రకాల పత్రాలు పోషించిన ఈ టీజర్ పై పలువురు ప్రముఖులు సైతం మంచి ప్రశంసలు అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది….!!