మొత్తానికి పెళ్ళి చేసుకుని ఒక ఇండివాడైన హీరో ‘నిఖిల్’…..!!

 314 total views,  1 views today

శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్దార్థ, ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా అవకాశాలు సంపాదించి తన స్వయంకృషితో మంచి పేరు దక్కించుకుని వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల తన స్నేతురాలు, డాక్టరైన పల్లవి వర్మతో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది.

nikhil wedding

కొన్నాళ్లుగా ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు నేటి ఉదయం తమ కుటుంబసభ్యుల మధ్య వివాహం చేసుకోవడం జరిగింది. వారి వివాహానికి మొత్తంగా 40 మంది హాజరయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో జరిగినప్పటికీ తమవారందరి మధ్య పెళ్లి ఎంతో సంతోషంగా జరిగిందని నిఖిల్ అన్నారు. కాగా వారిద్దరి పెళ్లి ఫోటోలు నేటి ఉదయం నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *