153 total views, 1 views today
ఇటీవల బాలయ్య, బోయపాటి ల కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతటి ఘన విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఒక అద్భుతమైన పవర్ఫుల్ స్టోరీతో దర్శకుడు బోయపాటి ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నట్లు టాక్.
ఇటీవల కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నిలుపుదల చేసారు. కాగా కొద్దిరోజులుగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నట్లు వార్తలు రాగా, వాటిపై నిన్న స్పందించిన నవీన్, అవన్నీ ఒట్టి పుకార్లే అని, ప్రస్తుతం తాను స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న జాతి రత్నాలు సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలిపారు……!!