ఇకపై అటువంటి సన్నివేశాల్లో నటించలేను : రాశి ఖన్నా….!!

 152 total views,  1 views today

ముందుగా మనం సినిమాలో ఒక చిన్న పాత్ర తో టాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా, ఆ తరువాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారి ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని అందుకోవడం జరిగింది. ఇక అక్కడి నుండి ఎన్నో మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం ముందుకు సాగుతున్న రాశి, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భామగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

பள்ளிப் பருவத்தில் ராசி கண்ணா ...

గతంలో వచ్చిన మద్రాస్ కేఫ్, అలానే ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయవలసి వచ్చిందని, అయితే ఆ సీన్స్ లో నటించేసమయంలో తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని చెప్పిన రాశి, ఇకపై తనవద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు బోల్డ్ సన్నివేశాల్లో నటించలేను అని తెగేసి చెప్పేస్తానని అనడం జరిగింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటానని చెప్పిన రాశి, ఇప్పటివరకు తన ఫ్యామిలీ సపోర్ట్ తోపాటు ఆ దేవుడి దయ వల్లనే తనకు మంచి సక్సెస్ లు లభిస్తున్నాయి అని చెప్పడం జరిగింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *