168 total views, 1 views today
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఎంతో కుదిపేస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు మన దేశాన్ని కూడా కొద్దీ వారాలుగా లాక్ లో ఉంచిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవ్వరూ కూడా తమ తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా చేయడంతో పోలీసులు, శ్యానిటరీ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా డాక్టర్లు మాత్రం తమ తమ విధుల్లో నిలిచి ఎప్పటికప్పుడు ప్రజలకు రక్షణ ను కల్పిస్తున్నారు. ఇకపోతే కొద్దిరోజలుగా కరోనా రోగులకు తమ ప్రాణాలొడ్డి ఎంతో గొప్ప మనసుతో సేవలు చేస్తున్న పలువురు వైద్యులకు మన దేశ వీరసైనిక విభాగం వారు పలు ప్రాంతాల్లో ప్రధాన ఆసుపత్రుల వద్ద ఉన్న వైద్యులపై పూల వర్షాన్ని కురిపించడం జరిగింది.
హెలికాఫ్టర్ సాయంతో ఈ విధంగా వైద్యులపై పూలవర్షం కురిపించడం ఎంతో అభినందనీయం అని, దేశ రక్షణకు సైనికులు సరిహద్దులో పోరాడుతుంటే, ప్రస్తుతం కోరలు చేస్తున్న ఈ మహమ్మారి కరోనని మన నుండి తరిమి కొట్టేందుకు ఎందరో డాక్టర్లు పడుతున్న కృషి, శ్రమ ఎంతో అభినందనీయం అని, వారు కూడా ఒకరకంగా యోధులేనని, అటువంటివారి పై ఈ విధంగా పూల వర్షం కురిపించడం నిజంగా అభినందనీయం అంటూ మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం ఒక ట్వీట్ చేసారు…..!!