మొత్తానికి చాలా గ్యాప్ తరువాత తెలుగు సినిమా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్…..!!

 335 total views,  1 views today

ముందుగా 2011లో వచ్చిన కెరటం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్,ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ని కూడా చవి చూసింది. ఇక ఆ తరువాత రకుల్ కు మంచి అవకాశాలు దక్కినప్పటికీ, వాటిలో ఎక్కువ శాతం పరాజయాల పేలాయి,

Rakul Preet Singh (aka) Rakul photos stills & images

కెరీర్ పరంగా ఆమెను కొంత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ ల లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న రకుల్, కొంత గ్యాప్ తరువాత మొత్తానికి తెలుగులో అఫర్ ని దక్కించుకుంది. ప్రస్తుతం కరోనా వలన మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో, తన ఫ్యామిలీ తో కొన్నాళ్లుగా గడుపుతున్న రకుల్ ప్రీత్, నిన్న మంచు లక్ష్మి నిర్వహించిన ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా కాసేపు ముచ్చటించారు. కాగా ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో తాను నటిస్తున్నానని, అలానే అతిత్వరలో నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి తీయనున్న సినిమాలో తాను హీరోయిన్ గా చేస్తున్నట్లు తెల్పింది రకుల్. మొత్తానికి తమ హీరోయిన్ కొంత గ్యాప్ తరువాత టాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *