తాజా వార్త :’ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి ఆఫీషియల్ అప్ డేట్ వచ్చింది …. ఫ్యాన్స్ కి పండగే …!!

 129 total views,  1 views today

ప్రఖ్యాత దర్శకడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి పాత్ర చేస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అలానే రామ్ చరణ్ పాత్ర వీడియోలు యూట్యూబ్ లో రిలీజ్ అయి బాగా రెస్పాన్స్ సంపాదించాయి.

RRR (film) - Wikipedia

లాక్ డౌన్ కు ముందు చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు ప్రారంభం అయింది. ఇక తమ సినిమాకు సంబంధించి రేపు ఒక పెద్ద అప్ డేట్ ఉండబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికే ప్రేక్షకులు, అభిమానులు తమ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని, తొట్టతొలిగా రేపటి అప్ డేట్ తో మీ అందరిలో మంచి జోష్ రావడం ఖాయం అంటూ రౌద్రం రణం రుధిరం టీమ్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ తెల్పింది …!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *