విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ ‘ఫైటర్’ కాదట : మరి ఏంటో తెలుసా….??

 338 total views,  1 views today

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తెలుగుతో పాటు మన దేశంలోని పలు ఇతర భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆనయ పాండే నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సహా నిర్మాతగా నటి ఛార్మి వ్యవహరిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సినిమా గురించి పలు విషయాలు ఆమె వెల్లడించారు.

Karan Johar and Puri Jagannadh film starring Vijay Devarakonda ...

విజయ్ దేవరకొండ ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడని, సెట్స్ లో ఏదైనా సందర్భంలో తనకు గాయమయినప్పటికీ కూడా ఆ రోజు షూటింగ్ పూర్తి అయ్యేవరకు దానిని ఎవరికీ చెప్పకుండా దాచి ఉంచుతాడని, ఒకవేళ చెప్తే అది షూటింగ్ కి భంగం కలిగిస్తుందని భావించే గొప్ప వ్యక్తిత్వం విజయ్ ది అని ఛార్మి అన్నారు. ఇక ఈ సినిమాకు ఫైటర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, ఇప్పటికే సినిమాకు అధికారిక టైటిల్ ని ఫిక్స్ చేయడం జరిగిందని, అతి త్వరలో దానికి ప్రకటించడం జరుగుతుందని, లాక్ డౌన్ అనంతరం సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఆమె అన్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *