597 total views, 1 views today
ప్రస్తుతం కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు కూడా మూత పడ్డాయి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడక్కడా కొన్ని హాస్పిటల్స్ లో కొందరు పేషెంట్స్ కు రక్తం అవసరం ఉంటోందని, అయితే అటువంటి సందర్భాల్లో ప్రజలు తమకు దగ్గర లో గల రక్త నిధి కేంద్రాల్లో రక్తదానం చేయాలని ఇటీవల తన చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో బ్లడ్ ఇస్తూ ప్రజలకు మెగాస్టార్ విజ్ఞప్తి చేసారు.
కాగా నేడు కాసేపటి క్రితం ఫలక్నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు వచ్చి స్వయంగా రక్తదానం చేయడం జరిగింది. తాను మెగాస్టార్ గారి పిలుపు మేరకు రావడం జరిగిందని, అలానే మిగతా ప్రజలు కూడా తమకు వీలైన చోట్ల రక్తాన్ని ఇవ్వాలని విశ్వక్ కోరారు…..!!