యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ ‘సీటీ మార్’ సాంగ్ …..!!

 132 total views,  1 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథం (డీజే). రెండేళ్ల క్రితం ప్రేక్షసకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని సాంగ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇక ఇప్పటికీ కూడా ఈ సాంగ్స్, యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

ఇక నేడు ఈ సినిమాలోని సీటీ మార్ సాంగ్ కు ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు 484కె లైక్స్ దక్కాయి. ఈ విధంగా సౌత్ ఇండియాలోనే అత్యధికే వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ కూడా చేరిపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *