215 total views, 1 views today
ప్రస్తుతం తన తదుపరి సినిమాల ఎంపిక విషయమై పలు కథలు వింటున్న సూపర్ స్టార్ మహేష్, తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని ఇటీవల వార్తలు రావడం జరిగింది. అయితే ఆయన కథ యొక్క పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాకపోవడంతో, కొద్దిరోజుల క్రితం ఆయనకు మంచి కథను వినిపించిన పరశురామ్ కు మహేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యలోనే మెగాస్టార్, కొరటాల కలయిక సినిమాలో కూడా మహేష్ ఒప్పుకోవడంతో ముందుగా దానిని పూర్తి చేసిన అనంతరం పరశురామ్ తో సినిమా కు డేట్స్ ఇవ్వనున్నారట.
అయితే ఈ విషయమై పరశురామ్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మహేష్, మీరు నా కోసం వెయిట్ చేయవద్దు, మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఉంటె ముందు అవి చూసుకోండి, అవి పూర్తి అయిన తరువాతనే మన సినిమా చేద్దాం అన్నారట. నిజానికి ఇటీవల నాగ చైతన్యతో కలిసి పరశురామ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా, దానిని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి మహేష్ సినిమా చేయాలని చూస్తున్నారట పరశురామ్. మరోవైపు నాగ చైతన్య కూడా ప్రస్తుతం లవ్ స్ట్రోరీ సినిమాతో పూర్తి గా బిజీగా ఉన్నారని, కాబట్టి చిరు, కొరటాల సినిమాలో మహేష్ పార్ట్ చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ఆయనతో సినిమా చేయవచ్చని, అందుకోసం ఎంత సమయం అయినా వెయిట్ చేస్తానని అన్నారట పరశురామ్. కాగా ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది….!!