సూపర్ స్టార్ మీద అభిమానంతో….. దర్శకుడు అనిల్ ఏమి చేసాడంటే…??

 128 total views,  2 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడం జరిగింది. సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక మొన్న సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి, వరుసగా సూపర్ స్టార్ మహేష్ కు హ్యాట్రిక్ విజయాలు అందించింది.

Image

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం అనిల్ గారు రాసుకున్న స్క్రిప్ట్ అని, కావున సినిమా సక్సెస్ ని ఆయనకు అంకితం ఇస్తున్నట్లు ఇటీవల మహేష్ మాట్లాడుతూ చెప్పారు. కాగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సూపర్ స్టార్ మహేష్ గారుతో పని చేయడం తన అదృష్టం అని, ఈ సినిమా సక్సెస్ తో తనకు రెట్టింపు పేరు వచ్చిందని అనిల్ అన్నారు. కాగా ఇటీవల అనిల్ దంపతులకు ఒక కుమారుడు జన్మించగా, మహేష్ బాబు మీద అభిమానంతో ఈ సినిమాలో హీరో పాత్ర పేరైన అజయ్ ని కలిపి తన కుమారుడు అజయ్ సూర్యన్ష్ అని నామకరణం చేసారు అనిల్ రావిపూడి.,,,,,!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *