201 total views, 1 views today
టాలీవుడ్ వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ తో మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక గత ఏడాది విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ఆయన తీసిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్3 స్క్రిప్ట్ ప్రస్తుతం సిద్ధం అవుతోందని,
కాగా అది ఎఫ్2 ని మించేలా మరింత ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నేడు తెలుగు దినపత్రిక ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి తెలిపారు. అయితే ఆ సినిమాలో మరొక హీరో కూడా ఉంటారని కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతుండడంతో, అది ఇప్పటికిప్పుడు చెప్పలేను అని, ప్రస్తుతం సిద్దమైన సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని బట్టి మూడవ హీరో ఉండే అవకాశం లేదని, అతి త్వరలో సెకండ్ హాఫ్ రాస్తాం అని, అప్పుడు ఏవైనా మరిన్ని పత్రాలు అవసరం ఉంటె మూడవ హీరోని కూడా తీసుకుంటానని అనిల్ అన్నారు……!!