తన ఫొటోస్ ట్రోలింగ్ పై రష్మిక ఏమన్నారంటే….??

 120 total views,  2 views today

ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన గీత గోవిందం సూపర్ హిట్ కొట్టడంతో రష్మికకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, అలానే నితిన్ తో కలిసి నటించిన భీష్మ సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకుని దూసుకుపోతున్న రష్మిక, మొన్న పలు రకాల డిఫరెంట్ ఫోజుల్లో ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది. 

ఇక ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది రష్మిక. అయితే ఆ ఫోటోలపై కొందరు పలు విధాలుగా సరదాగా వడివేలు ఫోటోలు జోడించి ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఇక నేడు ఎట్టకేలకు ఆ ఫన్నీ ట్రోల్స్ కు స్పందించిన రష్మిక. నా ఫోటోలను వడివేలు గారి ఫన్నీ ఫొటోస్ తో జత చేసి ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు థాంక్స్. నిజంగా ఆ మెమెల్లో వడివేలు సర్ చాలా బాగున్నారు అంటూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం రష్మిక పోస్ట్ చేసిన ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *