370 total views, 1 views today
మన టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దీని తరువాత నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ ఒక సినిమా చేయనున్నారు. అనంతరం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ప్రభాస్ చేయనునున్న భారీ మూవీ ఆదిపురుష్.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా లంకేశ్వరుడిగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ నటించనున్నాడు. అయితే ఇందులో సీత పాత్రకు ఎవరిని తీసుకుంటారు అనే దానిపై కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతుండడంతో ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ని ఫైనల్ చేసినట్లు టాక్. గతంలో ప్రభాస్ తో సాహో మూవీ చేసిన శ్రద్ధ ఈ వార్త నిజం అయితే మరొక్కసారి ఆయన కలిసి జోడీ కట్టనుందన్నమాట….!!